వేరే లెవెల్లో మాస్ స్టఫ్ తో “భగవంత్ కేసరి” టీజర్.!

Published on Jun 10, 2023 10:29 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా ఈరోజు బాలయ్య బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ అదిరే ట్రీట్ ని సిద్ధం చేశారు.

ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఈ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇన్స్టంట్ గా గూస్ బంప్స్ ఇచ్చే కంప్లీట్ మాస్ స్టఫ్ తో అయితే దీనిని డిజైన్ చేసారు. మెయిన్ గా బాలయ్య కొత్త డైలాగ్ డెలివరీ అయితే తన నుంచి చాలా కొత్తగా ఉందని చెప్పాలి.

వీటితో పాటుగా బాలయ్య పై యాక్షన్ సీక్వెన్స్ లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండగా మరో బిగ్గెస్ట్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే అది థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. థమన్ బాలయ్య కి లాస్ట్ టైం ఇచ్చిన రెండు సినిమాలు తరహాలో సాలిడ్ వర్క్ అయితే ఈ చిత్రానికీ అందించినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్ధం అయిపోతుంది. మొత్తానికి అయితే ఈ దసరా జాతర మామూలుగా ఉండదనే చెప్పాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :