నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. శ్రీలీల ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ గణేష్ ఆంథం అందరినీ అలరించి బాగా వ్యూస్ సొంతం చేసుకుంది.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం భగవంత్ కేసరి లో బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయట. ఆ విధంగా బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈమూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 19న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.