‘భగవంత్ కేసరి’ సెకండ్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Oct 4, 2023 12:00 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈమూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా కనిపించనుండగా దీనిని భారీ వ్యయంతో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా రేపు ఉయ్యాలా ఉయ్యాలా అనే పల్లవితో సాగె సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సాంగ్ ని రేపు సాయంత్రం 5 గం. ల 3 ని. లకు విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అనౌన్స్ చేసారు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు బాలకృష్ణ గారి మార్క్ యాక్షన్ అంశాలు అన్ని కలగలిపి తెరకెక్కుతున్న భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదల తర్వాత మంచి సక్సెస్ సొంతం చేసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.

సంబంధిత సమాచారం :