కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన ‘భైరతి రణగల్’చిత్రం కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు నర్తన్ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా నవంబర్ 29, 2024 లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
అయితే, ఈ సినిమా కన్నడ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ దక్కించుకోవడంతో, ఈ చిత్రాన్ని డిసెంబర్ 25 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుంది. కానీ, తెలుగులో మాత్రం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కాలేదు. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని నేటి(ఫిబ్రవరి 13) నుంచి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుంది ఆహా.
తెలుగు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో రాహుల్ బోస్, రుక్మిణి వాసంత్, దేవరాజ్, ఛాయా సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.