శ్రీ విష్ణు “భళా తందనాన” టీజర్ విడుదల కి సిద్ధం

Published on Jan 27, 2022 12:00 pm IST


వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా మారిపోయాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భళా తందనాన. ఈ చిత్రం లో కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకం పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను ప్రకటించిన సందర్భం నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను రేపు ఉదయం10:24 గంటలకు విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. మొహం మీద గాయాలతో ఉన్న శ్రీ విష్ణు పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :