వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా శ్రీ విష్ణు “భళా తందనాన”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా శ్రీ విష్ణు “భళా తందనాన”

Published on Jun 13, 2022 9:00 AM IST

శ్రీ విష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ భళా తందనాన. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ చిత్రాన్ని రజనీ కొర్రపాటి నిర్మించడం జరిగింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రం లో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటించగా, రామ చంద్ర రాజు కీలక పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు