అదరగొడుతున్న ‘భలే భలే మగాడివోయ్’ నైజాం కలెక్షన్ రిపోర్ట్

Bhale-Bhale-Magadivoy
పక్కింటి కుర్రాడిలా తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భలే భలే మగాడివోయ్’. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తూ పాజిటివ్ మౌత్ టాక్ ని తెచ్చుకుంది. చిన్న చిత్రాలతో పెద్ద హిట్స్ అందుకున్న మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సూపర్బ్ పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా కలెక్షన్స్ హై రేంజ్ లో ఉన్నాయి.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నైజాంలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా మొదటి రోజు 73 లక్షల షేర్ సాధిస్తే రెండవ రోజు అంతకు మించి 85 లక్షల షేర్ ని సాధించింది. అంటే ఓవరాల్ గా 2 రోజుల్లో 1.58 కోట్ల షేర్ ని సాధించింది. అలాగే మూడవ రోజు కూడా 1 కోటి షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నాని కెరీర్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఇదే ప్రధమం. అన్ని ఎరియల్లోనూ ఇదే విధంగా కలెక్షన్స్ ని సాధిస్తోంది. నాని సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ కలిసి నిర్మించారు.

Exit mobile version