“భామా కలాపం” టీజర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

Published on Jan 23, 2022 5:19 pm IST

ప్రియమణి ప్రధాన పాత్రలో అభిమన్యు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భామా కలాపం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భరత్ కమ్మ సమర్పణ లో SVCC డిజిటల్ పై బాపినీడు, సుధీర్ ఈదర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆహా వీడియో లో ఈ చిత్రం విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను ప్రముఖ నటి రష్మిక మందన్న విడుదల చేయడం జరిగింది. కామ్రేడ్, ఇది మీ కోసమే అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఈ చిత్రం టీజర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 11 వ తేదీన ఆహా వీడియో లో ప్రసారం కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :