రౌడీ హీరో చేతుల మీదుగా “భామా కలాపం” ట్రైలర్ రిలీజ్..!

Published on Feb 1, 2022 1:30 am IST

ప్రముఖ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో అభిమన్యు తాడి మేటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “భామా కలాపం”. భరత్ కమ్మ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ ప్రొడక్షన్ హౌజ్ పై ఈ చిత్రాన్ని బాపినీడు, సుధీర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్‌గా ఆహా వీడియోలో ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ భరత్ కమ్మ తన మొదటి సినిమా ‘డియర్ కామ్రేడ్’ నాతో చేశాడని, తనతో సినిమా చేయాలని నేనే అనుకున్నాను. నా కెరీర్‌లో అది మరచిపోలేని చిత్రం. ఇక ప్రియ‌మ‌ణిగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన చాలా బాగా చేస్తారు. ఈ ‘భామా కలాపం’ త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ అని అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ నేను నలబై ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. అంద‌రూ ఆద‌రించారు. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్‌తో క‌లిసి ఎస్‌వీసీసీ డిజిటల్ మీద చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నామని అన్నారు.

ప్రియమణి మాట్లాడుతూ ‘భామా కలాపం’ నా డిజిటల్ బెస్ట్ డెబ్యూ మూవీ అని చెప్పాలి. మొద‌టి షెడ్యూల్ కోసం ఆరు రోజులు కేటాయించాను. త‌ర్వాత షెడ్యూల్ కోసం నెల‌న్న‌ర పాటు స‌మ‌యం ఇవ్వలేకపోయాను. త‌ర్వాత సింపుల్‌గా, స్వీట్‌గా పూర్తి చేసేలా భ‌ర‌త్‌, అభి వ‌ర్క్ చేశారు. అనుప‌మ వంటి క్యారెక్ట‌ర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నేను ప్లే చేయ‌లేదు. చాలా అమాయక‌మైన గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తానని అన్నారు.

భరత్ కమ్మ మాట్లాడుతూ అభి నాతో 8 ఏళ్లుగా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. లాస్ట్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ ఐడియా చెప్పాడని, ఇద్ద‌రం క‌లిసి పాయింట్ మీద వ‌ర్క్ చేశాం. ఆహా టీమ్‌, అర‌వింద్‌గారికి ఈ క‌థ చెప్ప‌గానే వారికి బాగా న‌చ్చేసింది. అయితే అనుప‌మ పాత్ర‌లో ఎవ‌రు చేస్తార‌నే దానిపై అప్పుడింకా నిర్ణ‌యించుకోలేదు. ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి ప్రియ‌మ‌ణి గారు ఒప్పుకున్నారని, ఆమెకు చాలా థాంక్స్‌. ఎస్‌వీసీసీ మీద దీన్ని ప్రొడ్యూస్ చేసిన బాపినీడు, సుధీర్ గార్లకు థాంక్స్‌ అని అన్నారు.

సంబంధిత సమాచారం :