‘అహం బ్రహ్మాస్మి’లో సీనియర్ హీరోయిన్ ?

‘అహం బ్రహ్మాస్మి’లో సీనియర్ హీరోయిన్ ?

Published on Oct 19, 2021 1:22 AM IST

హీరో మంచు మనోజ్‌ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ అనే కొత్త సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఓ కీలక పాత్రలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెది తల్లి పాత్ర అట. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో భానుప్రియ పాత్ర ఎంటర్ అవుతుందట. కాగా భానుప్రియ – మనోజ్ ట్రాక్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కనిపించే కొత్త లుక్ కోసం మనోజ్ బాగా వర్కౌట్స్ చేశాడట.

కాగా ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ గా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు