భాగ్య‌న‌గ‌రంలో ‘భార‌తీయుడు’ సంద‌డి.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్క‌డంటే?

భాగ్య‌న‌గ‌రంలో ‘భార‌తీయుడు’ సంద‌డి.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్క‌డంటే?

Published on Jul 5, 2024 8:00 PM IST

యూనివ‌ర్సల్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సీక్వెల్ మూవీ ‘భార‌తీయుడు-2’ కోసం అన్ని భాష‌ల ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళంలో ప్ర‌మోష‌న్స్ చేసిన చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం తెలుగులోనూ ప్ర‌మోష‌న్స్ జోరు పెంచేందుకు సిద్ధ‌మైంది.

ఈ క్ర‌మంలో భార‌తీయుడు-2 సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు డేట్, ప్లేస్ ఫిక్స్ చేశారు మేక‌ర్స్. జూలై 7న సాయంత్రం 6 గంట‌ల నుండి ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. హైద‌రాబాద్ లోని ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది.

ఇక భార‌తీయుడు-2 సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ తో పాటు హీరో సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ సింగ్, కాజ‌ల్ అగ‌ర్వాల్, ఎస్.జె.సూర్య‌, ప్రియా భ‌వాని శంక‌ర్, బాబీ సింహా, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు