జూలై 6న వ‌స్తున్న ‘భార‌తీయుడు’.. సీక్వెల్ కాదు!

జూలై 6న వ‌స్తున్న ‘భార‌తీయుడు’.. సీక్వెల్ కాదు!

Published on Jul 2, 2024 10:00 PM IST

ఉల‌గ‌న‌య‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియ‌న్-2(తెలుగులో భార‌తీయుడు-2) సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాను స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 12న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. అయితే వారం రోజులు ముందు భార‌తీయుడు స‌ర్ప్రైజ్ ఇవ్వ‌నున్నాడు.

జూలై 6న తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్ల‌లో భార‌తీయుడు సంద‌డి చేయ‌నున్నాడు. అయితే, ఇది భార‌తీయుడు సీక్వెల్ మూవీ కాదు. 1996లో వ‌చ్చిన ‘భార‌తీయుడు’ సినిమాను ఇప్పుడు తెలుగులో రీ-రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. శంక‌ర్-క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీ అప్ప‌ట్లో సెన్సేష‌న‌ల్ హిట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు భార‌తీయుడు-2 రిలీజ్ కు వారం ముందుగా భార‌తీయుడు రీ-రిలీజ్ అవుతుండ‌టంతో అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ల‌భించ‌నుంది. వారం రోజుల వ్య‌వ‌ధిలో పార్ట్-1 అండ్ పార్ట్-2ని వారు వీక్షించ‌వ‌చ్చు. ఇక భార‌తీయుడు సినిమాలో మనీషా కొయిరాల‌, ఊర్మిళ హీరోయిన్లుగా న‌టించ‌గా.. భార‌తీయుడు-2లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. మ‌రి భార‌తీయుడు రీ-రిలీజ్ కు ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ల‌భిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు