‘భరత్ అనే నేను’ తర్వాతి షెడ్యూల్ ఎప్పుడంటే !
Published on Nov 20, 2017 8:35 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇటీవలే షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లిన మహేష్ త్వరలొనేకొత్త షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.

ఈ షెడ్యూల్ నవంబర్ 23నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట టీమ్. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook