భరత్ అనే నేను షూటింగ్ వివరాలు !

మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ఫస్ట్ ఓట్ గా విడుదలైన వాయిస్ మెసేజ్ అందరికి బాగా నచ్చింది. డిఫరెంట్ పబ్లిసిటీతో ఆకట్టుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ చిత్రీకరణలో ఉంది. ఈ నెల చివారివారలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా ఏప్రిల్ 27 న విడుదల కానుంది.

డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా తెరకెక్కించారు కొరటాల శివ. శ్రీమంతుడు సినిమా తరువాత కొరటాల మహేష్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అభిమానుల సమక్షంలో భారీగా చేయబోతున్నారు.

Exit mobile version