‘భరత్ అనే నేను’ కొత్త షూటింగ్ అప్డేట్ !


‘స్పైడర్’ పనుల్ని దాదాపు సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు హైదారాబాద్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో కొత్త షెడ్యూల్ కోసం లక్నో వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ 10 వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనుంది. అక్కడి జహాంగీరాబాద్ ప్యాలెస్, నాద్వా కాలేజ్, లక్నో యూనోవర్సిటీ వంటి వాటిల్లో షూట్ జరగనుంది.

ప్రముఖ షూటింగ్ లొకేషన్ అయిన ఈ లక్నోలో మహేష్ బాబు షూట్ చేయడం ఆయన కెరీర్లో ఇదే మొదటిసారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం సమకూరుస్తుండగా 2018 ఆరంభంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు.