వైరల్ అవుతున్న ‘భారతీయుడు-2’ కొత్త పోస్టర్ !

వైరల్ అవుతున్న ‘భారతీయుడు-2’ కొత్త పోస్టర్ !

Published on Nov 7, 2022 11:30 AM IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా నేడు కమల్ హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ కి విషెస్ చెప్తూ భారతీయుడు 2 టీమ్ ‘సేనాపతి’ పాత్ర పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ లో యాంగ్రీ లుక్‌లో ఉన్న కమల్ గెటప్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక భారతీయుడు 2 రన్ టైం 3 గంటలకు పైనే నిడివి ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ ఈ నిడివి ని కూడా తగ్గించే పనిలో ఉన్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు