సంక్రాంతి సీజన్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా రన్టైమ్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) చిత్రానికి 2 గంటల 20 నిమిషాల రన్టైమ్ లాక్ చేశారట మేకర్స్. ఫ్యామిలీ ఆడియన్స్కు సూట్ అయ్యేలా, ఎక్కడా బోర్ లేకుండా కథను డిజైన్ చేసినట్లు సమాచారం. కామెడీ, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ సమతుల్యంగా ఉండేలా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలుస్తోంది.
రవితేజ హీరోగా డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సెన్సార్ కూడా సాఫీగా పూర్తవడంతో విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. ఇక థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగా నవ్విస్తుందో, సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాల్సిందే.
