‘ఆరెంజ్’ సినిమా గురుంచి భాస్కర్ ఏం చెప్పుకొచ్చాడంటే?

Published on Sep 25, 2021 3:00 am IST


బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడు భాస్కర్ మంచి విజయాన్ని తన ఖాతలో వేసుకున్నాడు కానీ ఆ తర్వాత “పరుగు” సినిమా ఒకింత నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత విడుదలైన “ఆరెంజ్” సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే చాలా గ్యాప్ తర్వాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల విడుదలవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ “ఆరంజ్” సినిమా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నాడు. ఆరెంజ్ సినిమా స్క్రిప్ట్ కోసం నేను చాలా కష్టపడ్డానని, ఇప్పటికీ కొంత మంది అభిమానుల దృష్టిలో ఆరెంజ్ సినిమా ఒక కల్ట్ సినిమాగా నిలిచిపోయిందని అన్నారు. ఆరెంజ్ సినిమా ఇప్పుడు విడుదల అయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదేమో అని, సినిమా గురించిన ఏ కామెంట్‌ని కూడా అతిశయోక్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ నుంచి నాకు ఎప్పటికీ చాలా సపోర్ట్ ఉంటుందని అన్నారు.

సంబంధిత సమాచారం :