“భవదీయుడు భగత్ సింగ్” పై వారికి సాలిడ్ క్లారిటీ.!

Published on Jun 10, 2022 7:04 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమానే “భవదీయుడు భగత్ సింగ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా ఆల్రెడీ వచ్చింది. అయితే ఎప్పటి లానే మళ్లీ పవన్ సినిమాలకు కాస్త లేట్ అయ్యినట్టు గానే ఈ సినిమా కూడా లేట్ గానే స్టార్ట్ అయ్యేలా కనిపించింది. దీనితో ఈ సినిమా అనేక వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఈ సినిమాని పవన్ చెయ్యడం లేదు, ప్రాజెక్ట్ ఆగింది అని అనేక రూమర్స్ వచ్చాయి. అయితే మరి వీటికి సమాధానంగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సమాధానం చెప్పించడం ఆసక్తిగా మారింది. నిన్న మైత్రి మూవీ మేకర్స్ వారి చిత్రం నాని హీరోగా నటించిన “అంటే సుందరానికి” ప్రీ రిలీజ్ లో మాట్లాడుతూ స్వయంగా పవన్ తమ సినిమా ఆగలేదు అని చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే పలువురికి మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు హరీష్ సహా పవన్ లు కలిపి ఒక సాలిడ్ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :