భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్ రెస్పాన్స్ కి కృతజ్ఞతలు – టీమ్

Published on Sep 10, 2021 11:07 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ను ప్రకటించడం జరిగింది. భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ ను ప్రకటించడం మాత్రమే కాకుండా, ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా వినాయక చవితి శుభాకాంక్షలతో ఒక పోస్టర్ ను విడుదల చేసి ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ కి అద్భుత రెస్పాన్స్ రావడం పట్ల అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుసగా రెండు సినిమాలు చేస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో భీమ్లా నాయక్ చేస్తున్నారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం లో హారి హర వీరమల్లు లో పవన్ నటిస్తున్నారు. అంతేకాక డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేస్తున్నట్లు పవన్ పుట్టిన రోజు న ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి తో పాటు గా గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరిష్ శంకర్ తో సినిమా చేస్తుండటం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :