తన పై జరిగిన దాడి గురించి హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ !

Published on Jan 10, 2022 8:35 pm IST

మలయాళ భామ భావన మీనన్ ను 2017లో కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఓ హీరో సాయంతో ఓ ముఠా బలవంతంగా ఆమె కారులోకి ఎక్కి ఆమెను రెండు గంటల పాటు వేధించారని వార్తలు వచ్చాయి. పైగా ఈ కేసులో మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్‌ నిందితుడిగా కూడా ఉన్నాడు. అయితే, తాజాగా భావన తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ కేసుకు సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘అది అంత తేలికైన దాడి కాదు. ఆ దాడి కారణంగా గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డాను. నేరం చేసింది నేను కానప్పటికీ, అందరూ నన్ను అవమాన పరచారు. నన్ను ఒంటరిని చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి నన్ను వేధించారు. అయితే, నాకు సపోర్ట్ గా కొంతమంది ముందుకు వచ్చి.. నా కోసం వాళ్ళ గొంతులను వినిపించారు. న్యాయం కోసం చేసే పోరాటంలో నేను ఒంటరిగా లేను, నాకు తోడు ఉన్నారు’ అంటూ ఎమోషనల్ మెసేజ్ పెట్టింది భావన.

సంబంధిత సమాచారం :