“RRR” నుంచి భీమ్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట.!

“RRR” నుంచి భీమ్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట.!

Published on Dec 23, 2021 11:00 AM IST

పాన్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన భారీ చిత్రాల్లో వచ్చే ఏడాదిలో శుభారంభాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీసిన భారీ సినిమా లో వారు అల్లూరి సీతారామరాజుగా అలాగే కొమరం భీం గా నటిస్తున్నారు.

అయితే వారిలో ఒక్కో అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేస్తూ వస్తుండగా మేకర్స్ ఇపుడు భీమ్ పాత్రపై ఓ సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమాలో భీమ్ సాంగ్ ని రేపు రివీల్ చేస్తున్నట్టుగా దానిపై ప్రోమోని ఈరోజు రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ సాంగ్ పై సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు యంగ్ కంపోజర్ మరియు సింగర్ కాలభైరవ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

భీమ్ సాంగ్ మాత్రం కొన్నాళ్ల వరకు ఎవరినీ వదలకుండా వెంటాడుతుంది అని అంతలా మర్చిపోని విధంగా ఉంటుందని ఎగ్జైటింగ్ గా తెలిపాడు. దీనిని బట్టు రేపు వచ్చే సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు