లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది.. ఇక పూనకాలే..!

Published on Dec 31, 2021 8:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “భీమ్లా నాయక్‌”. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి ఇది రీమేక్. అయితే ఈ చిత్రం నుంచి గత నెల 7వ తేదీన “లాలా భీమ్లా అడవి పులి” గీతం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం. 2021కి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

అయితే 3 నిమిషాల 37 సెకన్లు నిడివి ఉన్న ఈ పాటలో ‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాలు కనిపిస్తాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటను రచించగా, అరుణ్ కౌండిన్య ఆలపించాడు. ఇక నార్మల్‌గానే సౌండ్ బాక్సులు బద్దలుకొట్టేలా ఈ పాటకు మ్యూజిక్ ఇచ్చిన తమన్, డీజే వర్షన్‌లో ఏకంగా సౌండ్ బాక్సులు పేలిపోయాలా మ్యూజిక్ ఇచ్చాడు. ‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25, 2022న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :