“భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ” ఫుల్ సాంగ్ నేడు విడుదల

Published on Mar 7, 2022 11:30 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యండ్సం హంక్ రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కి ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుండి భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ ఫుల్ సాంగ్ ను నేడు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం :