ఆకట్టుకుంటున్న “భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ” సాంగ్

Published on Mar 7, 2022 5:41 pm IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ చైతన్య నిర్మించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.

తాజాగా ఈ చిత్రం నుండి భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ సాంగ్ ను చుట్ట యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో సైతం మంచి వ్యూస్ తో దూసుకు పోతుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :