“భీమ్లా” నుంచి ఇది నిజంగా మ్యాజికల్ నెంబర్!

Published on Oct 14, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఎప్పడికప్పుడు అప్డేట్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు గ్లింప్స్ అలాగే ఫస్ట్ సింగిల్స్ వచ్చి భారీ రెస్పాన్స్ అందుకున్నాయి.

మరి ఇప్పుడు అంతే హైప్ లో ఈ సినిమా నుంచి గత కొన్ని రోజులుగా సెకండ్ సింగిల్ పై మేకర్స్ అలర్ట్ చేస్తుండగా ఇప్పుడు ఎట్టకేలకు ఈ సాంగ్ పై ప్రోమోను బయటకి వదిలారు. అయితే ఫస్ట్ సాంగ్ ఎంతైతే ఫ్రెష్ గా కొత్త ట్యూన్ లో అనిపించిందో ఈసారి “అంత ఇష్టం” కూడా అలానే అనిపిస్తుంది.

పవన్ మరియు నిత్య మీనన్ ల నడుమ ఉండే ఈ సాంగ్ ఫిమేల్ వాయిస్ తో ఒక 90 లలో సాంగ్ ని గుర్తు చేసేదానిలా అనిపిస్తుంది. ఈ ప్రోమో వరకు అయితే ఇంకో చార్ట్ బస్టర్ ఈ సినిమా నుంచి వస్తుంది అని అర్ధం అయ్యింది. ఇక రేపు వచ్చే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :