ధనుష్ సినిమా నుంచి తప్పుకున్న “భీమ్లా” నటి.?

Published on Jan 11, 2022 8:00 am IST

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ధనుష్ మొట్ట మొదటి సారిగా తెలుగులో చేస్తున్న తాజా చిత్రం “సార్”. తెలుగు సహా తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతూ హిందిలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా రీసెంట్ గానే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా భీమ్లా నాయక్ మరో హీరోయిన్ సంయుక్త మీనన్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా ఈమె అయితే అధికారికంగా ఎక్కడా చెప్పలేదు అలానే తన సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెట్టిన పోస్టులు కూడా డిలీట్ చెయ్యలేదు. మరి వేచి చూడాలి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం :