ఊహించని మాస్ వైబ్రేషన్స్ తో “భీమ్లా” అడవి తల్లి సాంగ్.!

Published on Dec 4, 2021 10:11 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సాలిడ్ గా తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒక్కొక్కటిగా సాంగ్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలా సినిమాలో నాలుగో సాంగ్ “అడవి తల్లి” పాటని ఇప్పుడు ఎట్టకేలకు విడుదల చేసారు.

మొదటగా స్వర్గీయ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని స్మరిస్తూ మొదలైన ఈ పాట మళ్ళీ కంప్లీట్ కొత్తగా ఉందని చెప్పాలి. దుర్గవ్వ మరియు సాహితిల గాత్రంతో చాలా పవర్ ఫుల్ గా ఈ సాంగ్ ఉండగా అంతే మాస్ అండ్ ఎమోషన్స్ తో రామజోగయ్య గారి సాహిత్యం ఉంది.

అలానే థమన్ మళ్ళీ ఈ సినిమాకి తన ట్యూన్ తో అవుట్ స్టాండింగ్ వర్క్ ని చూపించాడు. అయితే ఈ సాంగ్ లో ఇంకో హైలైట్ పవన్ మరియు రానా ల పత్రాలపై చూపించిన విజువల్స్ అని చెప్పాలి. ఒకపక్క మాస్ విజువల్స్ తో పాటు వారి లోని ఎమోషన్స్ కూడా హైలైట్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం భీమ్లా నుంచి ఇది మరి హార్డ్ హిట్టింగ్ సాంగ్ అని చెప్పాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :