“భీమ్లా నాయక్” నెక్స్ట్ మాస్ ఫీస్ట్ కి డేట్ కన్ఫర్మ్.!

Published on Dec 10, 2021 8:30 pm IST


వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీగా ఉన్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు ప్రభను పాత్రల్లో నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. మాస్ ఆడియెన్స్ లో భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమాని దర్సకుడి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

మరి ఇపుడు ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమా ఆల్బమ్ నుంచి ఎప్పటికప్పుడు ఒకదాన్ని మించిన పాట ఇంకొకటి వస్తుంది. దీనితో ఆల్రెడీ ఈ సినిమా ఆల్బమ్ హిట్ గా నిలిచింది. ఇక ముందు రోజుల్లో ఇంకో రెండు పాటలు కూడా రానున్నాయి. వాటిలో ఓ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి డేట్ లాక్ చేసినట్టు తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ సాంగ్ ని వచ్చే డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారట. మరి ఇది పవన్ పాడిన మాస్ సాంగ్ నా లేక వేరేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే అయితే మళ్ళీ మాస్ ఫీస్ట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. మరి ఈ సాంగ్ ని థమన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :