ఆరోజు కంటే బాక్సాఫీస్ దగ్గర పుంజుకుంటున్న “భీమ్లా నాయక్”.!

Published on Mar 3, 2022 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. రీమేక్ సినిమా అయినప్పటికీ సినిమాలో ఉండే మాస్ ఎలిమెంట్స్ నిమిత్తం భారీ అంచనాలు ఈ చిత్రం నెలకొల్పుకొని రిలీజ్ అయ్యి సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకొంది.

అయితే ఈ చిత్రం అంచనాలకి తగ్గట్టుగా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టేసింది. కానీ సోమవారం మొదటి వర్కింగ్ డే కి వచ్చే నాటికి మాత్రం ఊహించని రీతిలో డల్ అయ్యిపోయింది. దీనితో భీమ్లా పని అయ్యిపోయింది అని అనిపించింది కానీ శివరాత్రికి భారీగా పుంజుకుంది. అయితే పండుగ ఎఫెక్ట్ అది అనుకున్నా తర్వాత కూడా భీమ్లా నిలకడగా కొనసాగుతుండడం గమనార్హం.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో మినహా మిగతా మూడు షోలకి కూడా టికెట్లు బాగా తెగుతున్నట్టు తెలుస్తుంది. దీనితో నార్మల్ గా నాలుగో రోజు కంటే మిగతా ఐదు, ఆరవ రోజులు వసూళ్లు మెరుగ్గా వస్తున్నాయని టాక్. అయితే ఈ రన్ కంటిన్యూ అయితేనే గాని తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ సేఫ్ అవ్వడం కష్టం అని చెప్పాలి. మరి ఫైనల్ రన్ లో భీమ్లా నాయక్ ఎక్కడ ఆగుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :