నైజాం లో రెండో రోజు “భీమ్లా” రికార్డు వసూళ్ల వివరాలు.!

Published on Feb 27, 2022 12:58 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన భారీ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ అన్ని చోట్లా రికార్డు స్థాయి వసూళ్ళని కొల్లగొడుతుంది.

మరి నైజాం ఏరియాలో అయితే భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకోగా ఇప్పుడు రెండో రోజుకి సంబంధించిన వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మరి ఈ చిత్రానికి గాను రెండో అక్కడ ఏకంగా ఏడున్నర కోట్ల షేర్ నమోదు అయ్యినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

టాక్ కూడా బాగుండడంతో రెండో రోజు కూడా మంచి నిలకడను భీమ్లా ప్రదర్శించాడని చెప్పాలి. అలాగే ఈ ఆదివారం కూడా భీమ్లా నాయక్ మంచి నెంబర్ నే సెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి మూడో రోజు ఎంత వసూళ్లు ఈ సినిమా అందుకుంటుందో చూడాలి. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందివ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :