‘భీమ్లా నాయక్’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Feb 28, 2022 12:40 pm IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా ఈ సినిమా అన్ని చోట్లా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే USA లో $2 మిలియన్లను వసూలు చేసింది. కాగా నైజాంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఆదివారం 6 కోట్లును కలెక్ట్ చేసింది. అయితే, నైజాంలో 2వ రోజుతో పోలిస్తే కలెక్షన్లు కాస్త తగ్గాయి.

కానీ.. రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఔట్ అండ్ అవుట్ మాస్ పాత్రలో కనిపించడం పట్ల సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ మల్టీ స్టారర్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు.

సంబంధిత సమాచారం :