“వకీల్ సాబ్” ని మించి “భీమ్లా నాయక్” బిజినెస్.?

Published on Feb 8, 2022 12:00 pm IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకొచ్చే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ చెబుతాయి తన ఫాలోయింగ్ కోసం. అయితే పవన్ తన కెరీర్ లో సినిమాలకు మూడేళ్లు బ్రేక్ ఇచ్చి “వకీల్ సాబ్” అనే సినిమాతో వచ్చినా సాలిడ్ డే 1 రికార్డ్స్ ని పవన్ సెట్ చేసాడు. అయితే అది రీమేక్ అప్పటికి పరిస్థితులు దారుణంగా ఉండడంతో దాదాపు 90 బిజినెస్ ని ఈ చిత్రం జరిపింది.

కానీ ఇప్పుడు మళ్ళీ రీమేక్ సినిమా తోనే పవన్ వస్తున్న సంగతి తెలిసిందే. “భీమ్లా నాయక్” అనే భారీ మాస్ ఎంటర్టైనర్ తో పవన్ వస్తుండగా దీనికి మాత్రం “వకీల్ సాబ్” ని మించి బిజినెస్ జరుగుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే టోటల్ గా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై అయితే మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :