నైజాంలో కాస్త డ్రాపైన “భీమ్లా”..డే 4 వసూళ్లు ఎంతంటే.!

Published on Mar 1, 2022 12:31 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్”. మరి గత వారం రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ మొదటి మూడు రోజులు మంచి వసూళ్ళని అందుకొని అసలు సిసలు డే అయినటువంటి సోమవారం వర్కింగ్ డే ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూసారు. మరి అనుకున్నట్టే భీమ్లా ఆ రోజు కాస్త డ్రాప్ అయ్యాడని చెప్పాలి.

మరి నైజాం లో ఈ చిత్రం నాల్గవరోజు కి గాను 1.9 కోట్ల షేర్ ని అందుకుందట. మరి మిగతా రోజులతో పోలిస్తే ఇది బాగా డ్రాప్ అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే అక్కడ భీమ్లా ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది మరి లాంగ్ రన్ లో భీమ్లా నాయక్ ఎక్కడ ఆగుతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :