‘భీమ్లా నాయక్’ ఎఫెక్ట్.. గని రిలీజ్‌పై డీప్ డిస్కషన్స్..!

Published on Feb 17, 2022 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని చెప్పినట్టుగానే ఫిబ్రవరి 25నే విడుదల చేస్తున్నట్టు నిన్న అఫీషియల్‌గా ధృవీకరించారు. దీంతో రాత్రికే రాత్రే పరిస్థితులు మారిపోయి.. ఆ ఎఫెక్ట్ కాస్త మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన “గని” చిత్రంపై పడినట్టు తెలుస్తుంది.

అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీలపై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘భీమ్లా’కి పోటీగా నిలపడం రిస్క్ అనే అంశాన్ని ఇప్పుడు మేకర్స్ ఆలోచిస్తున్నారట. తాజాగా అందుతున్న వార్తల ప్రకారం రిలీజ్ విషయంలో డీప్ డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. చూడాలి మరీ బాబాయ్ సినిమా కోసం అబ్బాయ్ సినిమా రిలీజ్ తేదీనీ మారుస్తారేమో.

సంబంధిత సమాచారం :