‘భీమ్లా’ యుఫోరియా..భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాయ్.!

Published on Sep 12, 2021 8:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ రీమేక్ అండ్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మొదట్లో కంటే ఇప్పుడు సాలిడ్ అంచనాలు పెంచుకుంటూ వెళుతుంది. మరి దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ కి మాత్రం పవన్ కెరీర్ లోనే ఏ సినిమాకి రాని రెస్పాన్స్ వచ్చాయి. మరి భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే భారీ వ్యూస్ తో దూసుకెళ్తుంది.

ఇటీవలే ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ని కొల్లగొట్టిన ఈ సాంగ్ ఇప్పుడు 25 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఇంకా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ దూసుకెళ్తుంది. దీనితో థమన్ కూడా దీనిపై పోస్ట్ పెట్టి సంతోషం వ్యక్తం చేసాడు. అలాగే దీనితో పాటుగా భీమ్లా గ్లింప్స్ కూడా 1 మిలియన్ మార్క్ కి అత్యంత చేరువలో ఉంది. ఇది కనుక క్రాస్ అయితే ఇండియా లోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్స్ సాధించిన రికార్డ్ పవన్ ఖాతాలో పడుతుంది. మొత్తంగా మాత్రం భీమ్లా యుఫోరియా గట్టిగా ఉందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :