వైరల్ అవుతున్న “భీమ్లా నాయక్” స్పెషల్ ఫ్యామిలీ ఫోటో.!

Published on Jan 12, 2022 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. అన్నీ బాగుండి ఉంటే ఈరోజు జనవరి 12నే ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని థియేటర్స్ లో చూసి ఉండే వాళ్ళం. కానీ ఈ చిత్రం ఇప్పుడు ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.

ఇక ఇదిలా ఉండగా మేకర్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఏదొక అప్డేట్ ని పలు సమయాల్లో ఇస్తూ వస్తుండగా.. ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న భీమ్లా నాయక్ పాత్రకి భార్యగా నిత్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి నిత్య మీనన్ తో కలిసి పవన్ అలాగే వారి బాబుతో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఇది సినిమాలో వారి అందమైన ఫ్యామిలీ గా కనిపిస్తుంది. అలాగే ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ని గమనిస్తే వింటేజ్ కళ్యాణ్ కూడా గుర్తు రాక మానదు దీనితో ఈ ఫ్రేమ్ మరింత స్పెషల్ గా మారి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :