ఈ నెలాఖరులో పూర్తి కానున్న “భీమ్లా నాయక్” షూటింగ్!

Published on Oct 7, 2021 8:32 am IST

పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ను ఈ నెలాఖరు వరకు పూర్తి చేసే ఆలోచన లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి ల మధ్యన వచ్చే కొన్ని కీలక సన్నివేశాల తో పాటుగా రానా మరియు అతని సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంయుక్త మీనన్ లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన మేకింగ్ వీడియో, పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి ల వీడియోలు, మరియు ఫస్ట్ సింగిల్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. అంతేకాక పవన్ మరియు నిత్యా మీనన్ లకు సంబంధించిన రెండవ పాటను ఈ అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం కి స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి అప్డేట్ కి కూడా భారీ రెస్పాన్స్ రావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :