కంప్లీట్ డిఫరెంట్ గా సాలిడ్ ట్యూన్ లో ‘భీమ్లా’ ఫస్ట్ సింగిల్.!

Published on Sep 2, 2021 11:20 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో స్టార్ నటుడు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి ఈ చిత్రం నుంచి ఈరోజు పవన్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఎప్పుడు నుంచో ఊరిస్తున్న నాటు బీట్ ఫస్ట్ సింగిల్ అండ్ టైటిల్ ట్రాక్ ని విడుదల చేసేసారు.

అయితే ఈ సాంగ్ మాత్రం ఊహించిన దానికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉందని చెప్పాలి. మొన్న గ్లింప్స్ లో విన్న భీమ్లా ట్రాక్ తో పవర్ ఫుల్ మాసివ్ గా ఉంటుంది అనుకుంటే ఇది పూర్తి భిన్నమైన ట్యూన్ తో కనిపిస్తుంది.. అయితే ఇందులో అతి ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం అనన్య సామాన్యం అని చెప్పాలి.

భీమ్లా పుట్టుక నుంచి పోలీస్ గా ఉండే వ్యక్తిత్వం వరకు అందించిన సాహిత్యం చాలా కొత్తగా సాలిడ్ గా అనిపిస్తుంది. అలాగే ఈ సాంగ్ కి థమన్ నుంచి ఈ సరికొత్త ప్రెజెంటేషన్ ని కూడా ఎవరూ ఊహించి ఉండరు. పైగా సాంగ్ డిజైన్ కూడా అందులో విజువల్ అన్నీ ఫస్ట్ టైం చూసిన వారికి కొత్తగా అనిపిస్తాయి. మొత్తానికి మాత్రం పవన్ బర్త్ కి ఇది స్పెషల్ గిఫ్ట్ అని చెప్పాలి.

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :