“భీమ్లా నాయక్‌” నుంచి మరో అదిరిపోయే అప్డేట్..!

Published on Nov 29, 2021 10:52 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఫోర్త్ సింగిల్ “అడవి తల్లి మాట” పాటకి సంబంధించిన అప్డేట్‌ని రేపు ఉదయం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :