“భీమ్లా నాయక్” కి షాకింగ్ టీఆర్పీ నమోదు..!

Published on May 19, 2022 2:00 pm IST

ఈ ఏడాదికి టాలీవుడ్ సినిమా దగ్గర ఫస్ట్ టైం వచ్చిన బిగ్ మూవీ ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” అనే చెప్పాలి.పవన్ కెరీర్ లో మరి హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.

అయితే సిల్వర్ స్క్రీన్ పై భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియర్ లో మాత్రం షాకింగ్ టీఆర్పీ అందుకుందని చెప్పాలి. ఈ చిత్రం స్టార్ మా లో గత ఆదివారం మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కాగా కేవలం 9.1 టీఆర్పీ రేటింగ్ మాత్రమే అందుకుంది.

ఇది రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్ద సినిమాకి చాలా తక్కువే అని చెప్పాలి. అయితే ఈ చిత్రం ముందే ఆహా మరియు హాట్ స్టార్ ఆల్రెడీ చాలా మంది చూసేయడం వల్ల స్మాల్ స్క్రీన్ పై లైట్ తీసుకున్నారేమో అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందించారు.

సంబంధిత సమాచారం :