“భీమ్లా నాయక్” హిందీ రిలీజ్ అప్పటికి.?

Published on Mar 8, 2022 9:00 am IST


పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం గత ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ ని అందుకొని పవన్ కెరీర్ లో ఒక బిగ్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా రిలీజ్ ని గాను మొదట తెలుగు సహా హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత పలు కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. మొన్న ట్రైలర్ లాంచ్ తో హిందీలో రిలీజ్ మళ్ళీ కన్ఫర్మ్ అయ్యిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ వచ్చే ఏప్రిల్ నెలకి షిఫ్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి ఏప్రిల్ లో అయినా ఏ డేట్ కి రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :