భారీ అంచనాల నడుమ నిన్న టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన మోస్ట్ అవైటెడ్ చిత్రం భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఇది. మరి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పవర్ స్టార్ తన దమ్ము ఏంటో చూపించాడు.
భారీ స్థాయిలో ప్రీమియర్ వసూళ్లు కొల్లగొట్టడమే వాటితో కలిపి మొదటి రోజు వసూళ్లతో ఫస్ట్ డే లోనే ఏకంగా 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసి మాస్ వసూళ్లు సాధిస్తున్నాడు. దీనితో పవన్ ఖాతాలో మరో 1 మిలియన్ సినిమా పడింది అని చెప్పాలి. అలాగే మన దగ్గర కూడా భీమ్లా నాయక్ కి రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయని టాక్ ఉంది మరి వేచి చూడాలి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ళు ఏ రేంజ్ లో ఉంటాయో అనేది.
ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
POWER STORM's RAGE in USA ~ $1M & counting in USA ???? ???? ????#BlockBusterBheemlaNayak ????#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @PrimeMediaUS pic.twitter.com/10gDbjDyGt
— #BheemlaNayakDay (@SitharaEnts) February 25, 2022