టాక్..కన్ఫ్యూజన్ లో “భీమ్లా నాయక్”..?

Published on Nov 13, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇపుడు ముగింపు దశకు చేరుకోగా సినిమా విడుదల కి సంబంధించి ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఆల్రెడీ ఈ సినిమా జనవరి రేస్ నుంచి తప్పుకొని ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వవచ్చని గాసిప్స్ వినిపిస్తుండగా నిజానికి మాత్రం ఇంకా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ పట్ల ఇంకా కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉన్నారని టాక్. దీనితో ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది.

ఇక ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More