“భీమ్లా నాయక్” కూడా స్ట్రాంగ్ గానే..ఏమవుతుందో చూడాలి.!

Published on Nov 21, 2021 7:04 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కాంబోలో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మాస్ ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ పరంగా చాలా రోజులు నుంచి కాస్త గందరగోళం నడుస్తూనే ఉంది. ఇటీవల అధికారికంగా డేట్ జనవరి 12న అనే క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ తర్వాత నుంచి కూడా ఇండస్ట్రీలో పలు కీలక చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయని గుసగుసలు ఉన్నాయి. అయితే ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం భీమ్లా మేకర్స్ కూడా ఈ డేట్ విషయంలో ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నారట. కానీ ఇంకో పక్క ఈ డేట్ కూడా మారొచ్చనీ టాక్ ఉంది. మరి ఫైనల్ గా ఈ సినిమా డేట్ కి ఏమవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :