ఇంట్రస్టింగ్ బజ్ : మలయాళ బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేయనున్న బీమ్లా నాయక్ మేకర్స్

Published on Mar 7, 2023 10:21 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ భీమ్లా నాయక్. గత ఏడాది మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. ఇక ఆ తరువాత ఇదే బ్యానర్ నుండి వచ్చిన డీజే టిల్లు, అలానే ఇటీవల రిలీజ్ అయిన బుట్టబొమ్మ, సార్ మూవీస్ మూడూ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.

అయితే విషయం ఏమిటంటే, తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మలయాళ సూపర్ హిట్ ఫిలిం హృదయం రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ కలయికలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీని అతి త్వరలో రీమేక్ చేయనున్నారట. దీనికి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :