‘భీమ్లా’ మాస్ యుఫోరియా..ఏ రికార్డ్ ని వదల్లేదు.!

Published on Sep 2, 2021 3:05 pm IST

పవర్ స్టార్ రియల్ క్రేజ్ ఏ పాటిదో మల్లె ఇప్పుడు టాలీవుడ్ సహా ఇండియన్ ఫిల్మ్ ఆడియెన్స్ విట్నెస్ చేస్తున్నారు. పవన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్”. దీని నుంచి చాలా అంచనాలతో వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ ని కొల్లగొడుతుంది. మేకర్స్ ఒక రికార్డు కోసం పోస్టర్ డిజైన్ చేసే టైం కూడా ఇవ్వకుండా ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేస్తుంది.

ఓపక్క వ్యూస్ పరంగానే కాకుండా లైక్స్ పరంగా కూడా భారీ రికార్డులు ఆల్ టైం లెవెల్లో సెట్ చేస్తుంది. సౌత్ ఇండియా ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టడమే టార్గెట్ పెట్టుకొని వచ్చిన ఈ సాంగ్ పలు పాన్ ఇండియన్ సినిమాలను మించే రెస్పాన్స్ ని అందుకోవడం గమనార్హం. అసలు రెండు గంటలు కూడా పూర్తి కాకముందే 5 లక్షల లైక్స్ కి దగ్గరగా రాబట్టేయడం వేరే లెవెల్ మాస్ అని చెప్పాలి.

మొత్తానికి మాత్రం భీమ్లా మాస్ యుఫోరియా ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ కంప్లీట్ క్రెడిట్ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి, కంపోజర్ థమన్ లకి ముఖ్యంగా పవన్ అభిమానులకి దక్కుతుంది అని చెప్పాలి. మరి 24 గంటల్లో 1 మిలియన్ ఆల్ టైం రికార్డు లైక్స్ దాటుతారో లేదో చూడాలి.

భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :