ఆహాలో “భీమ్లా నాయక్” ప్రభంజనం.. మామూలుగా లేదుగా..!

Published on Mar 26, 2022 2:03 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా పలు రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం మార్చి 24 నుంచి ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఓటీటీ వేదికపై కూడా ఈ చిత్రం ఇప్పుడు పలు రికార్డులను నమోదు చేస్తుంది. అహాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ మినిట్స్‌ని “భీమ్లానాయక్” పూర్తి చేసుకుంది. కాగా ఓటీటీలో కూడా ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనంతో పవన్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్స్‌గా నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే ఇవ్వగా, థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :