సంక్రాంతి బరిలోకి “భీమ్లా నాయక్” రాదని తేలిపోయినట్టేనా..!

Published on Jan 2, 2022 3:02 am IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆర్ఆర్ఆర్” రిలీజ్ వాయిదా పడడంతో ఇప్పుడు సంక్రాంతి బరిలోకి దిగబోతున్న ఇతర చిత్రాల మీదకు అందరి దృష్టి మళ్ళింది. ఈ క్రమంలోనే ‘భీమ్లా నాయక్’ను ముందుగా చెప్పినట్టే జనవరి 12న విడుదల చేస్తారేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే తాజాగా ఓ యంగ్ హీరో మూవీ సంక్రాంతి రేసులోకి రావడంతో ‘భీమ్లా నాయక్’ మూవీ సంక్రాంతి బరిలోకి రాదని కన్ ఫామ్ అయిపోయింది. ఎందుకుంటే “భీమ్లా నాయక్” చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ‘డిజె టిల్లు’ చిత్రాన్ని నిర్మించింది. సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో “భీమ్లా నాయక్” సంక్రాంతి రేసులోకి రానట్టే అని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :