ఫిబ్రవరి 23న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక..!

Published on Feb 21, 2022 10:26 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో నేడు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందిన కారణంగా ఈ వేడుక కాస్త వాయిదా పడింది. అయితే ట్రైలర్‌ని మాత్రం వాయిదా వేయకుండా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్.

ఇదిలా ఉంటే తాజాగా ప్రీ రిలీజ్ వేడుకపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 23న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6:30 నిమిషాలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని, తెలంగాణ ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొననున్నట్టు తెలిపింది.

సంబంధిత సమాచారం :